చంద్రబాబు సంతాపం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది : జగన్

jagan11రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో మృతులకు సంతాప తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మృతులకు ప్రవేశ పెట్టిన సంతాప తీర్మానంపై అధికార, విపక్ష సభ్యులు విమర్శలు చేసుకున్నారు.

పుష్కరాల మృతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.రాజమండ్రిలో తొలిరోజే తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతికి చంద్రబాబే కారణమని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. వారిని చంపి నివాళులర్పించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్ లో స్నానానికి వచ్చారని ఆరోపించారు.చంద్రబాబు మేకప్ చేసుకుని వచ్చారని ,సినిమాలో హీరోలా కనిపించాలని అన్నరు.

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ చేసే వ్యాఖ్యలు సరికాదని, వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని స్పీకర్ కోడెల సూచించారు.