చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు

jagan1ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మానం సాకుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని , గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలను మోసం చేసి అధికారలోకి వచ్చి ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించారన్నారని ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జగన్ అన్నారు.

చంద్రబాబు ఓటుకు కోట్లు కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని , ఓట్లు కొనడానికి ప్రయత్నించి దొరికిపోయారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రెండేళ్లు,మూడేళ్లు తర్వాత పోతుందని,ప్రజలు బంగాళాఖాతంలో పడవేస్తారని అన్నారు. ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి ఇచ్చి వేస్తామని జగన్ ప్రకటించారు. ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రాష్ట్ర బంద్ రైతులకు భరోసా ఇస్తామని అన్నారు .