క్రేజ్ ని కాష్ చేసుకున్న రాయ్‌లక్ష్మీ

rp_khaidi-no-150-300x293.jpgక్రేజ్ ని కాష్ చేసుకోవటంలో హీరోయిన్లు ఎప్పుడు ముందు ఉంటారు . క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక గీతాల్లో నటించడానికి కథానాయికలు భారీగానే డిమాండ్ చేసుంటారు .

కానీ, రాయ్‌లక్ష్మీ ఒక్క అడుగు ముందుకేసి ఏకంగా 25 లక్షలు ఎక్కువ డిమాండ్ చేసినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ప్రత్యేక గీతం కోసం 15 లక్షలు పారితోషికం తీసుకున్న రాయ్‌లక్ష్మీ తాజాగా చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెంబర్150 కోసం ఏకంగా 40 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం .

చిరంజీవి, రాయ్‌లక్ష్మీ పాల్గొనగా ఈ ప్రత్యేక గీతాన్ని ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిత్రీకరించారు .