కేసీఆర్ తో జగన్ కుమ్మక్కు అయ్యాడు : చంద్రబాబు

24-kcr-jagan-babu-300జగన్ పగటి కలలు కంటున్నారని , మంత్రాలకు చింతకాయలు రాలవని, జ్యోతిష్కం అంటూ రెండేళ్లలో ముఖ్యమంత్రి అవుతానని అంటున్నారని , ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ ను ఎద్దేవ చేశారు.

ప్రతివారం కోర్టుకు వెళ్లే వ్యక్తి తనను విమర్శించడం చాల సిల్లీగా ఉందని , జగన్- హరీష్ రావు ఎక్కడ కలుసుకున్నారో తమవద్ద సమాచారం ఉందన్నారు.

రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి సహకరించాలని, టీఆర్ ఎస్ తో కుమ్మక్కై తమను అప్రదిష్ట పాలు చేసేందుకు జగన్ కుట్రచేసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు .

వైఎస్ హయాంలో తనపై 25 ఎంక్వయిరీలు పెట్టారని , జగన్ పై 11 ఛార్జీషీట్ ఉన్నాయని ,తన పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, నిప్పులాంటి వ్యక్తినని , అవినీతిరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పారు.