కెసిఆర్ పై నమోదైన కేసుల పై సిట్‌ ?

naidu-kcrఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది ఏపీ సర్కారు ఇందులో బాగముగా ఫోన్‌ ట్యాపింగ్‌ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) ఏర్పాటు చేయాలని భావిస్తోంది.  13 జిల్లలో కెసిఆర్ మరియు తెలంగాణా శర్కర్ పై నమోదైన  కేసులను  సిట్‌ ఏర్పాటు ప్రతిపాదన ను  పరిసిలిస్తున్నారు .

కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన అతర్గత నివేదిక వచ్చేంత వరకు వేచిచూసే ధోరణిని అవలంభించాలని నిర్ణయించింది. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఏపీలో వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో వీటన్నింటిపై దర్యాప్తునకు ‘సిట్‌’ వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఓటుకు నోటు కేసు ఈ వారంలో కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది. రేవంత్‌ రెడ్డి కేసు, ఫోన్‌ట్యాపింగ్‌ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌లో డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్‌ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనూరాధతో సమీక్షించారు. స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో రేవంత్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు చట్టపరంగా సమ్మతమేనా? అని చంద్రబాబు ఏపీ పోలీసు ఉన్నతాధికారులను ఆరా తీసారు .

సోమ, మంగళవారాల్లో స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. స్టీఫెన్‌ వాంగ్మూలం ఎఫ్‌ఐఆర్‌ నివేదిక, అదనపు ఎఫ్‌ఐఆర్‌లో పేర్ల అంశాన్ని పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు చంద్రబాబు బృందానికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.