కెసిఆర్ నోటీసు ఇవ్వడానికి ఓకే చేశార ?

naidu-kcrఓటుకు నోటు కేసులో ఏ పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరికించడంపై ఏసీబీతో లోతుగా చర్చిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులిచ్చే అంశంపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిస్తోంది. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

ఈ కేసులో చంద్రబాబు పాత్ర పై ఆధారాలు ఉన్నట్లు, కెసిఆర్ నోటీసు ఇవ్వడానికి ఓకే చేశారని కొన్ని మీడియాలలో ప్రచారం జరుగుతోంది.ఇంకా అదికారికంగా దీనిపై ప్రకటన రావల్సి ఉంది.

చంద్రబాబు డిల్లీ పర్యటన, సెక్యూరిబి సిబ్బంది మార్పు మొదలైన వాటిపై కూడా కెసిఆర్ వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.