కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యారు

pawan-kakinada-6జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన ఆత్మగౌరవ సభలో కొంచం కన్ఫ్యూజ్ అయ్యారు.

పవన్‌కల్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మగౌరవసభలో ముందుగా భారత్ మాతాకు జై కొడదామని ఆయన భారత్ మాతాకి జై అన్న నినాదాలు ఇచ్చారు.

తరువాత , తన ప్రసంగాన్ని హిందీ కొనసాగించారు , మాననీయ వెంకయ్య నాయుడు జీ.. బిజెపి పార్టీ తో కలిసి పనిచేశామని , కాని లడ్డు ఇచ్చారని ఆయన అన్నారు. రెండు, మూడు ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం అడుగుతుంటే, డిల్లీ లడ్డూ ఇచ్చారని, దానికన్నా బందరు లడ్డు ,తాపేశ్వరం కాజా బాగుంటుందని అన్నారు.

అటుపిమ్మట ఇలా అన్నారు , ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ దేశభక్తి గీతాన్ని రాసింది మహాకవి గురజాడ అని అన్నారు . వాస్తవానికి వస్తే దీన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. మరి మహాకవి గురజాడ ఏమ్మన్నారంటే “దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ “.

పవన్‌కల్యాణ్‌ కన్ఫ్యూజ్ అయ్యారని దీనిని బట్టి స్పష్టంగా అర్ధమౌతుంది .