అజయ్ కూతురికి ప‌వన్ అంటే చాలా ఇష్టo

ntr-pawan-kalyanప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్, గోపాల గోపాల ఫేం డాలీ కాంబినేషన్ లో కాట‌మ‌రాయుడు అనే చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాని డాలీ చాలా ప్రేస్టీజియస్ గా తెరకేక్కిస్తున్నాడు.

అయితే తాజాగా నటుడు అజయ్ గ్యారేజ్ సెట్ లోకి ఉన్న ఫలంగా కూతురుని తీసుకొచ్చి ప‌వన్ తో ఫోటో దిగాడు. అజయ్ కూతురికి కూడా ప‌వన్ అంటే చాలా ఇష్టమని అంటున్నాడు .

అజయ్ ఇటీవల జనతా గ్యారేజ్ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించగా మరో సారి పవన్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసాడు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో ప‌వ‌న్ త‌మ్ముడిగా క‌నిపించి మెప్పించిన అజయ్ ,కాటమరాయుడులో కూడా పవన్ తమ్ముడిగానే కనిపించనున్నాడు.